గణేష్ పండుగకు కరోనా ఎఫెక్ట్.. తీవ్రంగా నష్టపోతున్న విగ్రహాల తయారీదారులు

Update: 2020-08-21 06:13 GMT

Coronavirus effects makers of Ganesh idols: గణేష్ పండుగ వచ్చిందంటే చాలు పట్నం నుంచి పల్లె వరకు.. పెద్ద వీధుల నుంచి చిన్న చిన్న గల్లీల వరకు అన్నీ వినాయక మండపాలు దర్శనం ఇస్తాయి. వారం ముందు నుంచే ప్రతి ఒక్కరు మండపాల ఏర్పాటు‌లో బిజీ‌గా ఉటారు. కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో వినాయక చవితి కళ తప్పింది. ముఖ్యంగా ఇది విగ్రహాల తయారీ దారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది దీనిపై హెచ్ఎంటీవీ అందిస్తోంది స్పెషల్ స్టోరీ.

మన ఇంటిలో ఏ శుభకార్యం చేసినా ముందు గణపతికి పూజ చేసి ప్రారంభిస్తాం. చాలా సెంటిమెంట్ ఉన్న దేవుడిగా అందరూ భావిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు నవరాత్రులు వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి గణనాథుడికి కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వం ఇంటిలోనే పండుగ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు సందిగ్ధంలో పడిపోయారు.

ఇక పండుగ 2 నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ చేపట్టిన తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి విగ్రహాలు తయారు చేశాం కానీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు లేక పెట్టుబడి పోయి ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కరోనా కష్ట కాలంలో ఉగాది నుంచి అన్ని పండుగలు ఇంటి వద్దనే జరుపుకునే పరిస్థితి దాపురించింది. వినాయకచవితి ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్ పండుగ. కనీసం ఒక్కరోజు అయినా పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.

Tags:    

Similar News