Coronavirus in Gandhi Bhavan: గాంధీ భవన్‌ లో కరోనా కలకలం...

Coronavirus in Gandhi Bhavan: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రాజకీయ పార్టీలపైన ఎక్కువగానే పడుతోందని చెప్పుకోవచ్చు.

Update: 2020-07-15 13:15 GMT
Gandhi Bhavan (File Photo)

Coronavirus in Gandhi Bhavan: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రాజకీయ పార్టీలపైన ఎక్కువగానే పడుతోందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, వారి వద్ద పని చేస్తున్న సిబ్బంధి కరోనా బారిన పడ్డారు. ఇదే క్రమంలో జీహెచ్చ్ఎంసీ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా రావడంతో కార్యాలయం మూసేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌ ను కూడా మూసివేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌ లో కంట్రోల్ రూములో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గాంధీ భవన్‌లో కరోనా కేసు నమోదైందన్న సమాచారం జీహెచ్ఎంసీ సిబ్బంది సమాచారం అందగానే వారు వెంటనే అక్కడికి చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై నాయకులు, అధికారులు వెంటనే అప్రమత్తమై వారం రోజులపాటు గాంధీ భవన్‌ను మూసివేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక పోతే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. సీనియర్ నేత వి. హనుమంత రావుకు కూడా కరోనా సోకగా చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అంతే కాక గాంధీ భవన్ ట్రెజరర్ గూడురు నారాయణ రెడ్డికి కూడా కరోనా సోకింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత నరేందర్ యాదవ్ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా ప్రగతి భవన్, రాజ్‌భవన్‌లలోనూ భారీ సంఖ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 

ఇక పోతే తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారంఅత్యధికంగా 1550 కేసులు నమోదు. నిన్న కుడా అధికంగా 1,524కేసులు నమోదయ్యాయి. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 815, మేడ్చల్‌లో 97, సంగారెడ్డిలో 61, రంగారెడ్డిలో 240, ఖమ్మం 08, కామారెడ్డి 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 02, నిర్మల్ 03, కరీంనగర్ 29, నిజామాబాద్ 17, జగిత్యాల 02 , మెదక్ 24, మహబూబ్ నగర్ 07, మంచిర్యాల 12, కొత్తగుడెం 08, జయశంకర్ భుపలపలి 12, నల్గొండ 38, సిరసిల్ల 19, ఆసిఫాబాద్ 05, ఆదిలాబాద్ 07, వికారాబాద్ 21, నగర్ కర్నూల్ 01, జనగాం 04, ములుగు 06, వనపర్తి 05, సిద్దిపేట 04, సూర్యాపేట 15, గద్వాల్ 13, కేసులు నమోదయ్యాయి. నిన్న 10 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 375 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 24,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News