Corona Effect on Raksha Bandhan 2020 : రాఖీ పండుగపై కరోనా ఎఫెక్ట్

Corona Effect on Raksha Bandhan 2020 : రక్షా బంధన్… ఓ ప్రవిత్ర బంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ.

Update: 2020-08-03 05:54 GMT
ప్రతీకాత్మక చిత్రం

Corona Effect on Raksha Bandhan 2020 : రక్షా బంధన్… ఓ ప్రవిత్ర బంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సోదరి కట్టే రాఖీ..సోదరుడిపై గల అమితమైన ప్రేమకు ఓ తీపిగుర్తు. అంతే కాదు సోదరుల చేతికి రక్షాబంధనాన్ని కట్టి..తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. సోదరుడు రాఖీ కట్టిన సోదణిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీఇస్తాడు. అక్కల అనురాగం… తమ్ముళ్ల ఆత్మీయత.. అమ్మ నానలో సగమై చెల్లెమ్మకు తోడు నీడై ఉండే అన్నల పండుగ రాఖీ. పుట్టింటిని వదిలి మెట్టినింటికి చేరినా.. తోడబుట్టిన సోదరుడికి రాఖీ కట్టి.. ఆ రోజంతా కుటుంబంతో కలిసి గడిపి ఆనందించే సోదరీమణులెందరో.

అయితే ఈ ఏడాది అన్ని పండగల మీద పడినట్లే ఈ రాఖీ పండగ మీద కూడా కరోనా ప్రభావం పడింది. ప్రతి ఏడాది ఆడపడుచులు వారి తోబుట్టువులు ఎంత దూరంలో ఉన్నా సరే.. బస్సులు, రైళ్లలో వెళ్లి మరీ రాఖీలు కడుతుంటారు. తోబుట్టువుల రక్ష కోసం రాఖీ కట్టిన సోదరికి సోదరులు కూడా ఆడపడుచులని ఆనందపెట్టే విధంగా తోచిన బహుమతులు ఇస్తుంటారు.

కానీ ఈసారి కరోనా మహ్మమారి ప్రభావం రాఖీ పండుగపై పడడంతో సుదూర ప్రాంతాల్లో ఉంటున్నవారు రాఖీ కట్టడానికి వెళ్లలేని పరిస్థితి. బస్సులు, ప్రయివేటు వాహనాలు ఉన్నా కరోనా భయంతో ప్రయాణాలు చేయకుండా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. రాఖీ కట్టడానికి వెళ్లకుండా కేవలం శుభాకాంక్షలతోనే సరిపెడుతున్నారు. ఒకప్పుడు మోచేతి వరకు రాఖీలతో నిండిపోయే సోదరుల చేతులు ఈ సారి బోసిగానే కనిపిస్తున్నాయి. తోబుట్టువులు తమకు రాఖీ కట్టేందుకు రావడంలేదని ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ ఏడాది పండగను వచ్చే ఏడాది పండగను ఇకే సారి ఘనంగా చేసుకుందాం అని తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. ఇక మరో వైపు రాఖీల వ్యాపారం చేసే వ్యాపారులకు కూడా లాభసాటి బేరాలు లేకుండా పోతున్నాయి.

ఇక కోరోనా బారిన పడిన బాధితుల విషయానికోస్తే ఓవైపు బారిన పడ్డామనే బాధ, మరో వైపు తోబుట్టువులకు రాఖీ కట్టలేకపోతున్నామనే ఆవేదన వారిని కలిచివేస్తున్నాయి. హోం క్వారంటైన్లో ఉంటున్నవారు పక్క వీధిలో ఉంటున్న సోదరులకు రాఖీ కట్టలేకపోతున్నారని బాధపడుతున్నారు. ఆన్‌లైన్ రాఖీలు, కొరియర్ సేవలు ఇలా బాధపడే వారికి కొంత ఊరటనిస్తున్నాయి.



Tags:    

Similar News