Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు
Representational Image
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరింది. మృతుల సంఖ్య 551 కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా..కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 48,609 కి చేరింది. ప్రస్తుతం 18,500 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ 273, రంగారెడ్డి 73, కరీంనగర్ 54, మేడ్చల్ 48, పెద్దపల్లి 44, నిజామాబాద్ 42, సంగారెడ్డి 37, నాగర్‌కర్నూలు 32 కేసులు నమోదయ్యాయి.
Next Story




