logo
తెలంగాణ

Telangana BJP State Committee: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటి ప్రకటన

Telangana BJP State Committee: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటి ప్రకటన
X
బండి సంజయ్ ఫైల్ ఫోటో
Highlights

Telangana BJP State Committee : బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని ప్రకటించింది. 23 మందితో కూడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని బండి సంజయ్ ప్రకటించారు.

Telangana BJP State Committee : బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని ప్రకటించింది. 23 మందితో కూడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని బండి సంజయ్ ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించింది. అయితే ఈ సారి బీజేపీ రాష్ట్ర కమిటిలో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. కొత్తగా కమిటీలో నియమించ బడిన ఉపాధ్యక్షుల్లో విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.

ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులుని నియమించారు. కార్యదర్శులుగా రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణిలను నియమించారు. అధికార ప్రతినిధులుగా కృష్ణ సాగర్ రావు, రజిని కుమారి రాకేష్ రెడ్డిలను నియమించారు. ట్రెజరర్‌గా బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌). ఆఫీస్‌ సెక్రటరీగా ఉమా శంకర్‌లను నియమించారు.

ఇక ఇదే క్రమంలో బీజేపీ అనుబంధ విభాగాలకు కూడ అధ్యక్షులను నియమించారు. మహిళా మోర్చా అధ్యక్ష పదవిని గీతా మూర్తికి, కిసాన్ మోర్చాకు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చాకు కొప్పుల భాషా, ఓబీసీ మోర్చాకు అలె భాస్కర్, మైనార్టీ మోర్చాకు అస్పర్ పాషాను నియమించారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్ష పదవి భానుప్రకాష్‌ను వరించింది.


Web TitleTelangana BJP State Committee: Telangana BJP Announced State Committee with 23 Party Leaders
Next Story