logo
తెలంగాణ

Bandi Sanjay fire on Asaduddin owaisi: ఓవైసీపై బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay fire on Asaduddin owaisi:  ఓవైసీపై బండి సంజయ్ ఆగ్రహం
X
BANDI SANJAY
Highlights

Bandi Sanjay fire on Asaduddin owaisi: ప్ర‌ధాని మోడీ అయోధ్య యాత్ర పై ఓవైసీ చేసిన వ్యాఖ్యల పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ద్వజమెత్తారు

Bandi Sanjay fire on Asaduddin owaisi: ప్ర‌ధాని మోడీ అయోధ్య యాత్ర పై ఓవైసీ చేసిన వ్యాఖ్యల పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ద్వజమెత్తారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, గౌరవ ప్రధానిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.

అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వెళ్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ ఆలయం హిందువులకు మాత్రమే సంబంధించింది కాదని… భారతీయుల ఆలయమన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో ప్రధాని పాల్గొనడం చారిత్రాత్మక అవసరమన్నారు.

కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా నరేంద్రమోదీ పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉందనడం నిజమైతే మరి అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరంను మరి ఎవరు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు.సుప్రీం కోర్టు తీర్పు అనంత‌రం, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నదని బండి సంజయ్ ఓవైసీకి వివరణ ఇచ్చారు.

Web Titlebandi sanjay fire on asaduddin owaisi comments ram mandir
Next Story