రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ త్రీడీ స్టాచ్యూ ఏర్పాటు
Rajanna Sircilla District: ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ త్రీడీ స్టాచ్యూ ఏర్పాటు
Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం చౌరస్తాలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్రీడీ కార్ మరియు పోలీసు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. కలెక్టరేట్ చౌరస్తాలో నాలుగైదు రోడ్లు కలుస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే నిజంగానే వాహనం .. పోలీసులు ఉన్నారు అనే విధంగా కారు, పోలీసు త్రీడీ స్టాచ్యూలాగా ఏర్పాటు చేశామన్నారు. దీంతో వాహనదారులు దీనిని చూసి నిజంగానే పోలీసులు ఉన్నారని భావించి స్పీడ్ ను కంట్రోల్ చేసుకుంటారని ఎస్పీ తెలిపారు. ఇంకా అవసరమైన చోట్లలో ఇలాంటివి ఏర్పాటు చేస్తామన్నారు.