Congress: తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హాజరు కానున్న ఖర్గే, రాహుల్
Congress: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది.
Congress: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సభ నుంచే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.