Nagarjuna Sagar: నోములను సమాధి చేసింది సీఎం కేసీఆరే- రేవంత్‌రెడ్డి

Nagarjuna Sagar: టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడే నోముల నర్సింహయ్య రాజకీయంగా సమాధి అయ్యారని, సీఎం కేసీఆరే చేశారని విమర్శలు చేశారు ఎంపీ రేవంత్‌రెడ్డి.

Update: 2021-04-13 14:01 GMT

Nagarjuna Sagar: నోములను సమాధి చేసింది సీఎం కేసీఆరే- రేవంత్‌రెడ్డి

Nagarjuna Sagar: టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడే నోముల నర్సింహయ్య రాజకీయంగా సమాధి అయ్యారని, సీఎం కేసీఆరే చేశారని విమర్శలు చేశారు ఎంపీ రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన నోములకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు రేవంత్‌. పార్టీ ఫిరాయించినవారందరికీ మంత్రి పదవులు ఇచ్చారని, సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, కౌన్సిల్‌ ఛైర్మన్‌ను చేశారన్నారు. మీ కుటుంబంలోని ఓ వ్యక్తి ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారని ఆరోపించారు. మరి ప్రజల్లో ఉన్న నోముల నర్సింహయ్యకు ఓడితే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు..? గెలిస్తే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్‌.

కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తూ రేపు హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ పెడుతున్నారని అన్నారు రేవంత్‌. ఎన్నికల అధికారులు కూడా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగిపోయినట్టు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. కరోనా నిబంధనలు ప్రతిపక్షాలకేనా అధికార పార్టీకి లేవా అంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించారు రేవంత్.

సాగర్‌ ఉపఎన్నికలో పార్టీలకతీతంగా జానారెడ్డికి ఓటు వేసి, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్‌రెడ్డి. జానారెడ్డి అనే వ్యక్తి ఒక్క కాంగ్రెస్ నాయకుడే కాదని, తెలంగాణ సమాజానికి పెద్ద దిక్కు అని ఆయన చెప్పారు. జానారెడ్డి ఓడిపోతే రాష్ట్రానికే అవమానమని రేవంత్‌ అన్నారు. 

Tags:    

Similar News