Ponnala Lakshmaiah: 100 మీద మోడీకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది
Ponnala Lakshmaiah: ప్రధాని మోడీకి వందపై చాలా మక్కువ ఉన్నట్లుందని సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.
Ponnala Lakshmaiah: 100 మీద మోడీకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది
Ponnala Lakshmaiah: ప్రధాని మోడీకి వందపై చాలా మక్కువ ఉన్నట్లుందని సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. భారత్‌లో వ్యాక్సినేషన్ మైలురాయిపై స్పందించిన లక్ష్మయ్య దేశంలో 100కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రచారం చేస్తున్నారని, ఇంధన ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. టీకాలు సప్లయ్ కాకున్నా ఇతర దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేశాయన్నారు.
అయితే, మన దగ్గరే టీకాలు తయారవుతున్నా ఇంకా దేశంలో వ్యాక్సినేషన్ ఎందుకు పూర్తవ్వలేదని బీజేపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 2014 ముందు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నారని.. ఇన్ని రోజులైనా అది చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దని పొన్నాల లక్ష్మయ్య హితవుపలికారు.