Vijayashanthi-manickam tagore (file image)
టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతిని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ రంగంలోకి దిగారు. విజయశాంతి పార్టీ మారబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుండటంతో రాములమ్మతో మాణిక్యం ఠాకూర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం తరపున విజయశాంతితో చర్చలు జరిపారు. దాదాపు గంటపాటు సమావేశమైన ఠాకూర్ పార్టీ మారొద్దంటూ రాములమ్మకు సూచించారు. అయితే, కాంగ్రెస్‌లో తనకు జరిగిన అవమానం గురించి విజయశాంతి వివరించినట్లు తెలుస్తోంది.