MLC Kavitha: గడిచిన 16 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మాట్లాడలేదు
MLC Kavitha: కేసీఆర్ లేఖ రాసిన తర్వాతే పార్టీలపై ఒత్తిడి పెరిగింది
MLC Kavitha: గడిచిన 16 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మాట్లాడలేదు
MLC Kavitha: గడిచిన 16 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ ప్రధాని మోడీకి రాసిన లేఖలో సైతం మహిళా బిల్లును ప్రస్తావన లేదన్నారు. నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో తప్పనిసరి పరిస్థితిల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై తీర్మాణం చేశారని.. సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ లేఖ రాయడం వల్లే... పార్టీలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు.