Congress: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్
Congress: తమ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన బీఆర్ఎస్
Congress: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్
Congress: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో మహబూబ్‌నగర్ మున్సిపాలి అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం జరగనుంది. మొదట ఛైర్మన్‌పై అవిశ్వాస ఓటింగ్, తర్వాత వైస్ ఛైర్మన్‌పై ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. అవిశ్వాసం కోరుతూ 30 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 49 మందిలో 33 మంది సభ్యులు ఉంటేనే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంప్‌ల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి.
కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లు చేరుకుంటున్నారు. అయితే తమ పార్టీ కౌన్సిలర్లకు ఇప్పటికే విప్ జారీ చేసింది బీఆర్ఎస్. విప్‌ను సైతం లెక్క చేయకుండా కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ నేతృత్వంలో.. ప్రస్తుతం 20 మందికి పైగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం.