గడప దాటితే జైలుకే.. నేటి నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినం

కరోనా వైరస్ వ్యాప్తి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-17 02:53 GMT
Commissioner Anjani kumar

కరోనా వైరస్ వ్యాప్తి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.అయితే లాక్‌డౌన్‌ను ఇప్పటికీ కొందరు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. రకరకాల కారణాలు చెప్పి ఇష్టానుసారం రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవసరం లేకున్నా వాహనాలతో బయటకు తీస్తున్నారు. దీంతో అలాంటి వారిని జైలుకు పంపిస్తామని నగర కమిషనర్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రజలు సహకరిస్తేనే అడ్డుకోగలుగుతామని లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

99% మంది ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మాత్రమే ఉల్లంఘిస్తున్నారని అంజనికుమర్ తెలిపారు. అలాంటి వారివల్ల ప్రభుత్వం, ప్రజలు పడే కష్టం వృధా అవుతుందని అంజనీకుమార్ హెచ్చరించారు. పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు.

రాష్ట్రంలో ఉన్న కరోనా బాధితుల్లో కేసుల్లో సగంపైగా కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. జీహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం 240 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా..134 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రజల సౌకర్యం కోసం ఆ ఏర్పాట్లు చేశామన్నారు.

హైదరాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని అంజనీకుమార్ వెల్లడించారు. అంతేకాదు మూడు వేల ఐదు వందలు పిటీ కేసులు, నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు 2724 వాహనాలను సీజ్ చేశామన్నారు.

Tags:    

Similar News