Coin In Stomach: 25 ఏళ్లుగా కడుపులో పావలా కాయిన్..సర్జరీ చేసి తీసిన డాక్టర్లు
Coin In Stomach: చాలాసార్లు చిన్నపిల్లలు ఏదో ఒకటి మింగేస్తూ ఉంటారు. అయితే వెంటనే దాన్ని బయటకు తీసేస్తుంటారు. లేదంటే డాక్టర్‌ని కలుస్తారు.
Coin In Stomach: 25 ఏళ్లుగా కడుపులో పావలా కాయిన్..సర్జరీ చేసి తీసిన డాక్టర్లు
Coin In Stomach: చాలాసార్లు చిన్నపిల్లలు ఏదో ఒకటి మింగేస్తూ ఉంటారు. అయితే వెంటనే దాన్ని బయటకు తీసేస్తుంటారు. లేదంటే డాక్టర్‌ని కలుస్తారు. కానీ ఈ యువతి గత 25ఏళ్లుగా తన కడుపులో పావలా కాయిన్‌ని మోసుకుని తిరిగింది. విచిత్రం ఏంటంటే ఆమెకు ఇప్పటివరకు ఎప్పుడూ పెయిన్ కూడా రాలేదు. కానీ ఇటీవల ఆమె పోలీస్ ఉద్యోగానికి పరీక్షలకు వెళ్లినప్పుడు ఈ సమస్య తలెత్తింది. వెంటనే సర్జరీ చేసి కాయిన్‌ను బయటకు తీసారు.
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో యువతి కడుపులోంచి ఈ కాయిన్‌ను బయటకు తీసారు. అయితే ఆమెను ఇప్పటివరకు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే 25 సంవత్సరాల క్రితం ఆడుతున్న సమయంలో పావలా కాయిన్‌ను ఆ యువతి మింగేసింది. అయితే అప్పట్లో ఎటువంటి ప్రమాదం కాలేదు. దీంతో అలానే అందరూ ఉండిపోయారు.
కానీ తాజాగా పోలీసు ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత ఆ యువతి ఫిజికల్ టెస్ట్‌లో పాల్గొంది. కానె ఆమె శీరరం సహకరించలేదు. కడుపులో వివపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్‌ని కలిశారు. అప్పుడు డాక్లర్లు చెప్పింది ఏంటంటే.. ఆమె కడుపులో ఒక కాయిన్ ఉందని. ఆ తర్వాత మూడున్నర గంటల పాటు శ్రమించిన తర్వాత ఆ యువతి కడుపులోంచి పావలా కాయిన్‌ను డాక్టర్లు తీసారు. ఇలాంటి సంఘటనలు అ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి వాటిని క్రంటోల్ చేయొచ్చు.