Revanth Reddy: ఈనెల 13న మేడారం పర్యటనకు సీఎం రేవంత్
Revanth Reddy: ఈనెల 13న సీఎం రేవంత్ మేడారంలో పర్యటించనున్నారు.
Revanth Reddy: ఈనెల 13న మేడారం పర్యటనకు సీఎం రేవంత్
Revanth Reddy: ఈనెల 13న సీఎం రేవంత్ మేడారంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు మేడారంలో పర్యటించనున్న సీఎం.. గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే మేడారం ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించిన సీఎం.. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో మేడారం పర్యటనకు వెళ్తోన్న సీఎం ఆలయ అభివృద్ధిపై మరోసారి సమీక్ష జరపనున్నారు.