Revanth Reddy: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుపై పరిశీలించాలని ఆదేశం
Revanth Reddy: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు రేవంత్‌రెడ్డి. ఎయిమ్స్‌ను సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.