రాష్ట్రపతి, ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

Update: 2020-11-20 10:02 GMT

సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని లేఖ ద్వారా మోడీకి విజ్ఞప్తి చేశారు. హిందీ, ఇంగ్లీష్‌ భాషాల్లోనే పరీక్షలు జరపడం వల్ల ఇతర అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో స్పష్టం చేశారు.

దేశ మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. స్టాంప్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News