CM KCR: నేడు తుమ్మలూరు పార్కులో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
CM KCR: తుమ్మలూరులో మొక్కలను నాటనున్న గులాబీ బాస్
CM KCR: నేడు తుమ్మలూరు పార్కులో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
CM KCR: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. తుమ్మలూరులో సీఎం కేసీఆర్ మొక్కలను నాటనున్నారు. ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా.. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.