అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

Update: 2019-08-12 11:11 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ అత్తివరదరాజస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవితతో పాటు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజాతో పాటు పలువుపు నేతలు కూడా స్వామిని దర్శించుకున్నారు.

ఉదయం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచి చేరుకున్నారు. నగరిలో కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ రోడ్డుమార్గంలో కంచి చేరుకున్నారు. కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న సీఎం కేసీఆర్ అక్కడి నుంచి రేణిగుంట చేరుకోనున్నారు. రేణిగుంట నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరనున్నారు.  




 


Tags:    

Similar News