KCR: నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి

KCR: దసరా నాటికి పనులు పూర్తి చేపట్టాలని ఆదేశం

Update: 2022-04-20 00:47 GMT

KCR: నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి

KCR: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ కాసింత అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులపై సీరియస్ అయ్యారు. సచివాలయ నిర్మాణంలో సూచించిన మార్పులు ఎందుకు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం మెయిన్ ఎంట్రెన్స్ కు ఎదురుగా రిసెప్షన్ ను కూల్చి వేయాలని గతంలోనే చెప్పినప్పటికీ ఎందుకు మార్పు చేయలేదంటూ మండిపడ్డారు. అదే విధంగా సచివాలయ పనులకు సమాంతరంగా ఆలయ, మసీదు, చర్చి నిర్మాణ పనులు జరపాలంటూ అధికారులకు సూచించారు. దాదాపు గంటన్నర పాటు నూతన సచివాలయ పనులను పరిశీలించారు.

సచివాలయ పనుల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్ మొదటి అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించారు లిఫ్ట్ ఏరియా, మంత్రుల చాంబర్స్, డిజైన్స్ పై అధికారులతో ఆరా తీశారు. కొత్త సెక్రటేరియట్ నిర్మణంలో అవసరమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్బుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పిల్లర్లు, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లు, వాటి నాణ్యతను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియ తిరిగి చూశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి. స్టోన్ సప్లై గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  

Full View


Tags:    

Similar News