నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే..

Update: 2020-06-16 04:45 GMT

తెలంగాణలో వ్యవసాయరంగాన్ని ప్రగతిపథం వైపు నడిపించే ప్రక్రియ వేగవంతమైంది. ఇవాళ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో వ్యవసాయరంగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రైతులకు మేలు జరిగే కీలక నిర్ణయాలపై ఈ సమీక్షలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో చేపట్టే సమావేశంలో వ్యవసాయరంగానికి మేలు కలిగించే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉపాధి హామీ పథకం, వ్యవసాయరంగంపై సుధీర్ఘంగా సమీక్షించనున్నారు. కోతలప్పుడు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా 460 కోట్ల రూపాయలతో లక్ష కళ్లాలు నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ఈ కళ్లాలను ఉపాధి హామీ పథకాల నిధులతో నిర్మించనున్నారు. గ్రామీణ కూలీలకు పనితోపాటు రైతులకు మేలు జరుగుతుంది.

అలాగే నియంత్రిత సాగు విధానం, వర్షకాల పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. వీటితోపాటు గ్రామీణ ఉపాధిహమీ, పట్టణ, పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధులు, హరితహారం వంటి అంశాలను ప్రస్థావించనున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు కలెక్టర్లతోపాటు అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా అటవీ అధికారులు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News