నియంత్రిత సాగే రైతుబంధు : సీఎం కేసీఆర్

నియంత్రిత సాగే రైతుబంధు : సీఎం కేసీఆర్
x
KCR (File Photo)
Highlights

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి...

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు నిర్ధారించారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తుంది.

ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదని సీఎం పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై ఆయన గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని, ఇది మంచి పరిణామమని చెప్పారు.

రాష్ట్రంలో గతేడాది తరహాలోనే వర్షాకాలంలో40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నారు కేసీఆర్. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లోకంది పంట వేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలన్నారు. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గతేడాది మాదిరిగానే వేసుకోవచ్చు.

వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలని కోరారు. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డిమాండ్‌ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలన్నారు. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది. దానిని కూడా పండించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories