CM KCR : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించనున్న గులాబీ బాస్

CM KCR : అనంతరం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేసీఆర్‌

Update: 2023-10-15 04:00 GMT

CM KCR : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించనున్న గులాబీ బాస్

CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ దూకుడు పెంచింది.ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో కెసిఆర్ రంగ ప్రవేశం చేస్తున్నారు. నేటి నుండి ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్ సిచువేషన్. ఎన్నికల తేదీకి 100 రోజుల ముందే అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించిన గులాబీ బాస్ ఇన్ని రోజులు ప్రత్యర్ధులను దెబ్బతీసే రాజకీయ వ్యూహాలపై కసరత్తు చేశారు. ఇక రీసెంట్ గా ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు.

తెలంగాణ భవన్ లో ఉదయం పార్టీ మేనిఫెస్టో అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన తర్వాత నేతలకు కేసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అక్టోబర్ 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తామని ముందే గులాబీ బాస్ తెలిపారు. అదే కాకుండా కాకుండా హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందంటూ ఇప్పటికే లీకులిచ్చారు కేటీఆర్‌. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించడం, వాటి పరిధిని పెంచబోతున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టో పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ బిజెపిలకు పోటీగా కెసిఆర్ ఇలాంటి మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టాలంటే... ఉన్న పథకాలను మరింతగా మెరుగుపరచడం కొత్త పథకాల ప్రకటనపై అంతా ఆశ పెట్టుకున్నారు. రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, రైతాంగం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత, మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ, దిగువ, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్త పథకాలు, ఒంటరి మహిళలు, బీసీలు, మైనారిటీల కోసం స్పెషల్ స్కీమ్స్‌, యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉంటాయని అంటున్నారు.

మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తోన్న కేసీఆర్ జనాకర్షక పథకాలతో మేనిఫెస్టోను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆసరా, వికలాంగుల పెన్షన్లు పెంచడంతో పాటు 50 ఏండ్లు నిండిన రైతులకూ కూడా పెన్షన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే కళ్యాణ లక్ష్మీ సాయాన్ని 2లక్షలకు పెంచే యోచన ఉన్నారట కేసీఆర్. దళితబంధు తరహాలో మహిళా బంధు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ధరలో 50శాతం రాయితీ ప్రకటించే ఛాన్స్ ఉంది. రైతు బంధు సాయాన్ని కూడా 10వేల నుంచి 15వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్త హామీలను కూడా మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News