CM KCR: ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రతిపాదించిన కేసీఆర్..ఆమోదించిన సభ
CM KCR: వీలైనంత త్వరగా ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం
CM KCR: ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రతిపాదించిన కేసీఆర్..ఆమోదించిన సభ
CM KCR: తెలంగాణలో కొన్ని జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వాల్మీకిబోయ, బేదరు, కిరాతక, నిషాదీప్, పెద్దబోయలు, తలయారీ, చుండువాళ్లు, కాయితీ లంబాడీలు, బాటు మధురాలను ఎస్టీ జాబిజాలో కేంద్రం చేర్చాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2016లోనే కేంద్రానికి నివేదిక సమర్పించినా ఇప్పటివరకు దానిని ఆమోదించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి పై వారందరినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.