ఏపీలో కూడా జరిగేది ఇదే రాసుకోండి... కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈనెల 5 నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే.

Update: 2019-10-24 12:43 GMT

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని  ఈనెల 5 నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని కొన్ని రోజులుగా కార్మిక జేఏసీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా చేపట్టారు.దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారిని వ్యాఖ్యానించింది. 

తాజాగా  హుజూర్ నగర్ ఉపఎన్నిక విజయం తర్వాత కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన ఆయన..  ఏపీలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ విలీనంపై కేవలం కమిటీ మాత్రమే వేశారని తెలిపారు. ఏపీలో కూడా జరిగేది ఇదే రాసుకోండి అని వ్యాఖ్యానించారు. అక్కడ కూడా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయన్నారు.

కార్మికులు అనవసరంగా సమ్మెకు దిగారని, పండుగ సమయంలోనే అధిక ఆదాయం వస్తుందని, అలాంటి రోజుల్లో సమ్మెకు దిగుతారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ పై ఐదారు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. యూనియన్ లీడర్లు చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తోందని కేసీఆర్ అన్నారు.

Full View

Tags:    

Similar News