టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-01-04 10:54 GMT
Kcr File Photo

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపాల్టీ ఎన్నికల బాధ్యతలు మంత్రులకే అని తేల్చిచెప్పేశారు. ఒక్క మున్సిపాల్టీ ఓడినా మంత్రిపదవి ఊడుతుందని కూడా ముందస్తు హెచ్చరికలు చేశారు. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లు గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు కేసీఆర్. అభ్యర్థి ఫైనల్ అయ్యాక అతడి విజయం కోసం శ్రమించాలన్నారు. వెన్నుపోటు రాజకీయాలు సహించేది లేదన్నారు. పాత కొత్త నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని.. టిక్కెట్ల పంపిణీ, రెబల్స్ బుజ్జగింపులు బాధ్యత ఎమ్మెల్యేల దేనని తెలిపారు కేసీఆర్. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ కు పోటీ కాదు. అలాంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తే వారి గెలుపు కోసం అందరు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అని కేసీఆర్ అన్నారు.


Full View


  

Tags:    

Similar News