శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Update: 2020-10-07 09:15 GMT

రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో డిజీపీతో సహా కమీషనర్స్, డిజీ స్థాయి అధికారుల అన్నీ జిల్లాల అధికారుల హాజరయ్యారు. వారితో పాటు హోం, ఆటవీశాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్, ఆయా శాఖల కార్యదర్శులు, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రగతిభవన్లో సీఎంతో సమావేశం అయ్యారు.

తెలంగాణలో మావో కదలికల నేపధ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు మహిళల భద్రత, డ్రగ్స్, అక్రమ రవాణా అడ్డుకట్టపై సీఎం సమీక్షించనున్నారు.

ఇటీవల కాలంలో రాష్ట్రంలో మావోల కదలికలపై పోలీసులు దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అడవుల్లో మావోల కోసం వేట కొనసాగుతోనే ఉంది. భద్రద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. డ్రోన్ల సాయంతో మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ మావోలను పట్టుకొని ఎన్ కౌంటర్లు జరిపారు.

Tags:    

Similar News