CM KCR: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: అద్దాలమాదిరిగా రోడ్లు ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష
CM KCR: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎప్పటికీ చెక్కుచెదరకుండా.. అద్దాల మాదిరిగా రోడ్లు ఉండేలా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పాడైన రోడ్ల మరమ్మతులు, పనుల్లో నాణ్యత పెంచాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా.. రోడ్లు భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై కూడా చర్చించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.