Telangana: కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
Telangana: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా మరో ముందడుగు వేశారు.
Telangana: కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
Telangana: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా మరో ముందడుగు వేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్‌కు చేరుకుంటాయి. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి ప్రత్యేక బస్సులో చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను హల్దీకాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌కు తరలించే కార్యక్రమం చేపట్టారు.
ఆ తర్వాత, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వర జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర చెరువులను నింపుతాయి. నీటి విడుదలతో పలు మండలాల రైతులకు లబ్ధి చేకూరనుంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.