ఈటలతో అయ్యేది కాదు.. పొయ్యేది కాదు.. వైరల్ అవుతున్న కేసీఆర్ ఆడియో
KCR: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.
ఈటలతో అయ్యేది కాదు.. పొయ్యేది కాదు.. వైరల్ అవుతున్న కేసీఆర్ ఆడియో
KCR: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తనుగుల ఎంపీటీసీ భర్తకు ఆయన ఫోన్ చేశారు. దళితబంధు పథకంపై ఫోన్‌లో ప్రస్తావించిన సీఎం కేసీఆర్ అన్ని గ్రామాలకు దళిత బంధు పథకం గురించి తెలియాలన్నారు. దళిత బంధు మంచి పథకమని, ఈ పథకం ద్వారా ఒక్క హుజూరాబాదే కాదు రాష్ట్రంలోని దళితులంతా బాగుపడతారన్నారు. దళితబంధు దేశంతో పాటు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం కేసీఆర్.
ఇక ఇదే ఫోన్ సంభాషణలో ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈటల చాలా చిన్నోడన్న ఆయన ఈటలతో అయ్యేది కాదు పోయేది కాదన్నారు. ఈటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.