అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండంబరంగా జరుగుతున్నాయి.

Update: 2020-06-02 03:50 GMT
cm kcr tributes to telangana martyrs

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండంబరంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా గన్‌పార్క్‌ దగ్గరకు చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను సీఎం గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం జెండా ఎగరేస్తారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.

1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 2012 జూన్ రెండవ తేదీన రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది దశాబ్దాలుగా పోరాడి ఉద్యమంలో వందలాది మంది బలిదానాలు చేసుకొన్నారు. 


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News