Guda Anjaiah: గూడ అంజయ్య సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్
Guda Anjaiah: సబ్బండ వర్గాల జీవన తాత్వికతకు, సాంస్కృతిక చైతన్యానికి గూడ అంజయ్య పాట చిరునామాగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.
గూడ అంజయ్య(ఫైల్ ఇమేజ్ )
Guda Anjaiah: సబ్బండ వర్గాల జీవన తాత్వికతకు, సాంస్కృతిక చైతన్యానికి గూడ అంజయ్య పాట చిరునామాగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి, పాట ద్వారా దివంగత గూడ అంజయ్య చేసిన ఉద్యమ కృషిని ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.
తెలంగాణ స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే గూడ అంజయ్య ఆశయాలను, తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తున్నదని సీఎం తెలిపారు. ఆ దిశగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నదని, తద్వారా గూడ అంజయ్యకు ఘన నివాళి అర్పిస్తున్నామని, సీఎం అన్నారు.