సీఎం కేసీఆర్ మేడారం పర్యటన అనూహ్యంగా రద్దు

Medaram Jatara: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన అకస్మాత్తుగా రద్దయింది.

Update: 2022-02-18 13:30 GMT

సీఎం కేసీఆర్ మేడారం పర్యటన అనూహ్యంగా రద్దు

Medaram Jatara: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన అకస్మాత్తుగా రద్దయింది. నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కేసీఆర్ ఇవాళ సమ్మక్క-సారక్కలను దర్శించుకొని, తల్లుల ఆశీర్వాదం తీసుకుంటారని భావించారు. కేసీఆర్ షెడ్యూల్ కూడా ఆ మేరకు ఖరారైంది. ఈ ఉదయం 11 గంటలకు మేడారం బయల్దేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారని, అవసరమైతే ఈ రాత్రికి కూడా మేడారంలోనే బస చేయడానికి వీలుగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అయితే సీఎంఓ నుంచి కేసీఆర్ టూర్ రద్దయినట్టు ఆఖరి నిమిషంలో తెలియడంతో మంత్రులు, కీలకమైన ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Tags:    

Similar News