CM KCR: రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. తెలంగాణ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం..
CM KCR: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
CM KCR: రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. తెలంగాణ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం..
CM KCR: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు... ప్రగతిభవన్ నుంచి ఆన్‌లైన్లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలోని సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS తొలి విద్యాసంవత్సరం తరగతులను సీఎం ప్రారంభించారు.
రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం తెలంగాణ చరిత్రలోనే కొత్త అధ్యాయమని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో 850 MBBS సీట్లు ఉండేవన్నారు. ప్రస్తుతం 1150 సీట్లు పెరిగాయన్నారు. మొత్తం 2,790 సీట్ల అందుబాటులోకి వచ్చాయని సీఎం తెలిపారు... గతంకంటే MBBS సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా పెంచుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం కేసీఆర్ 33 జిల్లాల్లో వైద్యకళాశాలలకు భవనాలు నిర్మిస్తామని చెప్పారు భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలను నిర్మిస్తామన్నారు. భవిష్యత్తులో ఎన్నో రకాల వైరస్‌లు పట్టి పీడిస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేనలా వైద్య రంగాన్ని పటిష్ట పరుస్తామన్నారు. త్వరలోనే వైద్య సహాయక సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు కేసీఆర్.