CM KCR: మల్లన్న సాగర్ జాతికి అంకితం.. చివ‌రి ర‌క్తం బొట్టు ధార‌పోసైనా ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతా..

Mallanna Sagar: మల్లన్నసాగర్ ను ప్రారంభించుకోవడం చరిత్రక ఘట్టమన్నారు సీఎం కేసీఆర్.

Update: 2022-02-23 10:51 GMT

CM KCR: మల్లన్న సాగర్ జాతికి అంకితం.. చివ‌రి ర‌క్తం బొట్టు ధార‌పోసైనా ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతా..

Mallanna Sagar: మల్లన్నసాగర్ ను ప్రారంభించుకోవడం చరిత్రక ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. మల్లన్నసాగర్ ఒక్క సిద్దిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే మహత్తరమైన జల భాండాగారమన్నారు. ప్రాజెక్టుపై ఎన్ని కేసులు వేసినా ఇంజినీర్లు భ‍యపడలేదన్నారు ముఖ‌్యమంత్రి కేసీఆర్.

మల్లన్నసాగర్‌, ఏడుపాయల ప్రాంతాల్లో ప్రకృతి సౌందర్యం ఉంటుందని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ స్థాయిలో కలర్ ఫౌంటెన్‌.. మల్లన్న సాగర్‌లో నిర్మాణం చేపట్టాలని, సింగపూర్‌ నుంచి పర్యాటకులు వచ్చేంత గొప్పగా అభివృద్ధి చేయాలని మంత్రి హరీష్‌రావుకు సూచించారు సీఎం కేసీఆర్. 

దేశం దారితప్పుతోందని, దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు సీఎం కేసీఆర్. కర్నాటకలో మతపరమైన గొడవలకి తెరలేపారని, దాంతో అక్కడి విద్యాసంస్థలను మూసేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు కేసీఆర్.

దేశం నలుమూలలు బాగోవాలంటే కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాంటివారిని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు వెళ్తున్నానన్న సీఎం కేసీఆర్ తన చివరి రక్తపు బొట్టు దారబోసైనా సరే దేశంలోని పరిస్థితులను సెట్‌రైట్‌ చేస్తానన్నారు.

Tags:    

Similar News