CM KCR: దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతోంది.. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి
CM KCR: దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR: దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతోంది.. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి
CM KCR: దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని చెప్పారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్బంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు దొండే సహా పలువురు మరాఠ నేతలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో రిజిస్టర్ చేయించామన్నారు కేసీఆర్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఫసల్ భీమా డబ్బులు మీలో ఎవరికైనా అందాయా అంటూ ప్రశ్నించారు కేసీఆర్.