CM Jagan: నేడు వైఎస్సార్‌ నేస్తం నిధులు విడుదల

CM Jagan: ఉ.11గం.లకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

Update: 2023-06-26 03:04 GMT

CM Jagan: నేడు వైఎస్సార్‌ నేస్తం నిధులు విడుదల

CM Jagan: ఏపీ వ్యాప్తంగా అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు 5 వేల రూపాయల స్టైఫండ్‌ చొప్పున 2023-24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్సార్‌ లా నేస్తం' ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి- జూన్ మధ్య 5 నెలల కాలానికి ఒక్కొక్కరికి 25వేల చొప్పున మొత్తం 6 కోట్ల,12 లక్షల,65వేల, రూపాయలను క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు సీఎం జగన్. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏడాదికి 60వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తున్నారు.

మూడేళ్లకు ప్రతి న్యాయవాదికి ఒక లక్షా 80వేల రూపాయల స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇవాళ అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 5వేల,781 మంది యువ న్యాయవాదులకు నాలుగేళ్లలో మొత్తం 41.52 కోట్ల ఆర్థిక సాయం అందించారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏపీ అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, న్యాయవాదులు అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 25 కోట్ల ఆర్థిక సాయం అందించారు.

Tags:    

Similar News