Hyderabad Weather: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు భీకర గాలులు.. ఆ సమయంలో బయటకు రావద్దంటూ సూచన
Hyderabad Weather: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు భీకర గాలులు.. ఆ సమయంలో బయటకు రావద్దంటూ సూచన
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా ఎండలు, కొద్దిగా వానలతో సాగిన వాతావరణం ఇప్పుడు పూర్తిగా మేఘాలతో నిండి కనిపిస్తోంది. ఈ రోజంతా మేఘాలతోనే ఉంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉదయం 10 గంటల వరకు కురిసాయి. ప్రధానంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
వర్షానికి తోడు, విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ఈదురుగాలుల వల్ల కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి. రోడ్లపై ఎక్కడిక్కడ చెత్త చెల్లాచెదురుగా ఎగురుతోంది. కొన్నిచోట్ల రేకులు, ప్లాస్టిక్ వస్తువులు, డబ్బాలు, డ్రములు లాంటివి ఎగిరిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఈదురుగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గాలిసుడి..70 కిలోమీటర్ల వేగంతో ఉంది.
నేడు రోజంతా హైదరాబాద్ పై మేఘాలు దట్టంగా పర్చుకుని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపించడం లేదు. ఇంతలా వాతావరణం మార్పిపోవడానికి కారణం ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన మేఘాలు..ఇండియాపైకి వచ్చాయి. బలమైన గాలులు కూడా మేఘాలు వచ్చేందుకు కారణమయ్యాయి. సాయంత్రం 6 తర్వాత హైదరాబాద్ అంతటా ఓ మోస్తరు వర్షం కొనసాగుతోంది. అది రాత్రి 10గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు గాలిని ద్రుష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది.
రాత్రి 10 తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం షురూ అవుతుంది. రాత్రి 12గంటలకు వర్షం మరింత ఎక్కువగా అవుతుంది. ఆ సమయంలో ప్రజలు రోడ్లపై పెద్దగా తిరగరు..కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉండదు. కానీ భారీ వర్షాల రోడ్లపై నీరు ప్రవహించే ఛాన్స్ ఉంటుంది. ఈ వర్షం 16వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు కురుస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చెబుతోంది.