పాలకవీడు డెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఎస్సై, కానిస్టేబుళ్లకు గాయాలు

సూర్యాపేట జిల్లా పాలకీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2025-09-22 11:38 GMT

సూర్యాపేట జిల్లా పాలకీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన ఒక కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలంటూ బీహార్‌ కూలీలు దాడికి దిగారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.​ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులను కూడా బీహార్ కూలీలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి దాడి చేశారు, దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనలో ఎస్సై, ఒక హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూలీలపై లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News