రాజాసింగ్ నినాదాలకు దిగొచ్చిన చైనా.. దానికి కారణం తాము కాదని లేఖ
తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కరోనా మహమ్మారి పై పోరాటానికి భారతీయులంతా దీపాలు వెలిగించి ఐక్యతను చాటాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న ధూల్‌పేటలో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి.. 'చైనీస్ వైరస్ గో బ్యాక్' అంటూ చేసిన నినాదాలు చేశారు. దీనిపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్(పార్లమెంట్) లియూ బింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు లేఖ రాశారు.
ఈ లేఖలో చైనీస్ వైరస్ గో బ్యాక్ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. చైనా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి నివేదించిన తొలిదేశం. అయితే దీని అర్థం ఈ వైరస్ చైనా నుంచి ఉద్భవించిందని కాదన్నారు.
దీనిపై రాజాసింగ్ ప్రతిస్పందించారు. 'అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఇది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని పేర్కొన్న విషయం నిజంకాదా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.