Cold Wave: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాపై చలి పంజా
Cold Wave: ఆసిఫాబాద్ జిల్లాపై చలిపంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా తిర్యాణి మండలం గిన్నేధరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Cold Wave: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాపై చలి పంజా
Cold Wave: ఆసిఫాబాద్ జిల్లాపై చలిపంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా తిర్యాణి మండలం గిన్నేధరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గటంతో దట్టంగా పొగమంచు కమ్ముతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహనదారులు ప్లడ్ లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. చలికి జనం వణికిపోతూ చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. సాయంత్రం ఆరింటిలోపే ప్రజలంతా ఇళ్లకు చేరుకోగా, రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.