One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.200 జరిమానా..!

One Rupee Biryani: కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఓపెనింగ్ సందర్భంగా ఒక్క రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ అంటూ ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది.

Update: 2023-06-17 06:11 GMT

One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.200 జరిమానా..!

One Rupee Biryani: కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఓపెనింగ్ సందర్భంగా ఒక్క రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ అంటూ ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. దీంతో జనం పొటెత్తారు. రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేసి మరీ బిర్యానీ కొనేందుకు బారులు తీరారు. దీంతో పోలీసులు రెస్టారెంట్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. రెస్టారెంట్‌కు వచ్చి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు రెండు వందల ఫైన్ వేశారు. జనం వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయని రెస్టారెంట్ యజమానిని పోలీసులు ప్రశ్నించారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో చేసేది లేక రెస్టారెంట్ యజమాని చేతులెత్తేశాడు. 

Tags:    

Similar News