Bhavya Anand Prasad: అజ్ఞాతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త భవ్య ఆనంద్ ప్రసాద్

Bhavya Anand Prasad: భవ్యాస్ బిల్డర్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఆనంద్‌ ప్రసాద్‌ కుమారుడు, బిజినెస్‌ పార్టనర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Update: 2021-03-28 10:01 GMT

Bhavya Anand Prasad: అజ్ఞాతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త భవ్య ఆనంద్ ప్రసాద్

Bhavya Anand Prasad: భవ్యాస్ బిల్డర్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఆనంద్‌ ప్రసాద్‌ కుమారుడు, బిజినెస్‌ పార్టనర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆనంద్‌ ప్రసాద్ తనను మోసం చేశాడని 2017వ ఏడాదిలో కోటి రూపాయలు తీసుకుని ఇప్పటివరకు ఇవ్వలేదని సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద్‌ ప్రసాద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భవ్య ఆనంద్ ప్రసాద్ ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే పాలిటిక్స్‌లో కూడా రంగ ప్రవేశం చేశాడు. అందులో భాగంగా ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరపున శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసాడు. ఇక కేసు నమోదు కావడంతో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. భవ్య ఆనంద ప్రసాద్ తెలుగులో శౌర్యం, వాంటెడ్, లౌక్యం, పైసా వసూల్ వంటి సినిమాలను నిర్మించాడు. తాజాగా భవ్య క్రియేషన్స్ నితిన్‌తో చెక్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News