Telangana: ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..?

Telangana: గణేశ్ ఉత్సవాల అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ *సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం

Update: 2021-09-05 12:32 GMT

తెలంగాణ అసెంబ్లీ (ఫోటో ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయ సభలు సమావేశమవనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ, కౌన్సిల్​సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గణేశ్ ఉత్సవాల తర్వాతే ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండటం వల్ల గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ఈ నెల నాలుగో వారంలో ఉభయసభల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. దళితబంధుతో పాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Full View


Tags:    

Similar News