Cell Phone Blasted: ఉన్నట్టుండి ఒక్కసారిగా జేబులో పేలిన సెల్ ఫోన్.. భయంతో పరుగులు
Cell Phone Blasted: ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు ఎక్కువగా పేలిపోతున్నాయి. ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు, వంటగదిలో పెట్టినప్పుడు, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు.. సెల్ ఫోన్ పేలిన సంఘటనలు చాలానే జరుగుతున్నాయి.
Cell Phone Blasted: ఉన్నట్టుండి ఒక్కసారిగా జేబులో పేలిన సెల్ ఫోన్.. భయంతో పరుగులు
Cell Phone Blasted: ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు ఎక్కువగా పేలిపోతున్నాయి. ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు, వంటగదిలో పెట్టినప్పుడు, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు.. సెల్ ఫోన్ పేలిన సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా శ్రీనివాస్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. అతని ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది.
శుక్రవారం సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని శ్రీనివాస్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ సమయంలో ప్యాంట్ జేబులో ఉన్న సెల్ హీట్ ఎక్కింది. ఏదో కాలుతున్నట్లు శ్రీనివాస్‌కు అనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీద్దాం అనుకునేలోపు సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది.
సెల్ ఫోన్ పేలిన శబ్ధానికి చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీసారు. ఆతర్వాత నెమ్మదిగా తేరుకుని చూస్తే శ్రీనివాస్ నొప్పితో బాధపడుతుండటం గమనించారు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్లు అతనికి చికిత్స చేస్తున్నారు. సెల్ ఫోన్ ఒక్కసారిగా హీట్ ఎక్కడం వల్లే పేలిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు.