గాంధీలో త్రుటిలో తప్పిన ప్రమాదం

కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

Update: 2020-06-03 05:52 GMT
Gandhi Hospital (File Photo)

కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులో తిరుగుతున్న ఓ సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి బెడ్‌పై పడింది. దీంతో కరోనా బాధితులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా మార్చారు. ఈ ఆస్పత్రిలో ఎక్కువగా ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.

ఈ అంతస్తులోని ఓ వార్డులో మంగళవారం ఉదయం ఒక్క సారిగా తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హుక్‌ నుంచి ఊడి అమాంతం కిందపడింది. దీంతో కరోనా బాధితుల్లో ఇద్దురు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ వచ్చిందని మానసికంగా ఎంతో కుమిలిపోతున్న రోగులు ఈ సంఘటనతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావును వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News