సీసీఎస్ ఎస్సై సైదులు ఆత్మహత్య

Update: 2019-12-23 06:29 GMT
సైదులు

హైదరాబాద్ అంబర్‌‌పేటలో విషాదం చోటు చేసుకుంది. సీసీఎస్ ఎస్‌ఐ సైదులు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను స్కూళ్లో దింపేందుకు భార్య వెళ్లిన సమయంలో సైదులు సూసైడ్ చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని సైదులు భార్య ఆరోపించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సైదులు ఇచ్చిన మెడికల్ బిల్లును ఉన్నతాధికారులు తిరస్కరించడంతో మనస్ధాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.   

Tags:    

Similar News