వేములవాడలో నకిలీ నోట్ల కలకలం… మహిళా పొదుపు సంఘాల్లో ఆందోళన
వేములవాడ పట్టణ పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ రూ.500 నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.
వేములవాడలో నకిలీ నోట్ల కలకలం… మహిళా పొదుపు సంఘాల్లో ఆందోళన
వేములవాడ పట్టణ పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ రూ.500 నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెలా రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉండగా, నగదు చెల్లింపుల సమయంలో నకిలీ నోట్లు బయటపడటంతో సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవల వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు తమ నెలవారీ చెల్లింపుల నగదును టీమ్ లీడర్‌కు అందజేశారు. ఆ నగదును శుక్రవారం బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా, అందులో ఒక రూ.500 నోట్ నకిలీదిగా గుర్తించారు. దీంతో సంఘం ప్రతినిధులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.
ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే రెండుసార్లు నకిలీ నోట్లు ఎదురవగా, మూడోసారి కూడా అదే సంఘంలో నకిలీ నోట్ వెలుగు చూడడంతో సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై నెలవారీ నగదు చెల్లింపులు ఒకే రోజు, అది కూడా బ్యాంకు పని వేళల్లోనే ఇవ్వాలని సంఘం మహిళలకు సూచించినట్టు సమాచారం.
వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.