KTR: మరో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముమ్మాటికీ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.
KTR: మరో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముమ్మాటికీ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పేదోళ్ల పొట్టకొట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని.. మరో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఎంఐఎం పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు.
ఓట్ల కోసం నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలవకముందే బెదిరిస్తే.. గెలిచాక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.